ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వేకోడూరులో స్థానిక సంస్థల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం - Nominations of start-up local organizations

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మెుదలైంది. కడప జిల్లా రైల్వేకోడూరులో మెుదటి రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు పది మంది నామినేషన్లను వేశారు.

Nominations of start-up local organizations
ప్రారంభమైన స్థానిక సంస్థల నామినేషన్లు

By

Published : Mar 9, 2020, 7:57 PM IST

ప్రారంభమైన స్థానిక సంస్థల నామినేషన్లు

కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటిరోజు ఎంపీటీసీ ఎలక్షన్​లో భాగంగా సాయంత్రం నాలుగు గంటల వరకు పది మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అదేవిధంగా ఓబులవారిపల్లె మండలం పుల్లంపేట, పెనగలూరు, చిట్వేలు మండలాల్లో తక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ వేశారు. రైల్వే కోడూరు పట్టణంలో ఎంపీటీసీ అభ్యర్థులు వైకాపా తరఫున ఆరుగురు నామినేషన్లు వేయగా ఇతర పార్టీ నేతలు ఎవరు నామినేషన్లు దాఖలు చేయలేదు. వైకాపా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కోరుట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ రైల్వేకోడూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 90 శాతం సీట్లు తామే గెలుస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:రాజంపేట పురపాలక ఎన్నికలకు బ్రేక్​

ABOUT THE AUTHOR

...view details