కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయంలో క్వారంటైన్ వార్డ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు పరిశీలించారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు క్వారంటైన్ వార్డు ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనకు దిగారు. ఈ గ్రామంలో 6వేల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. సీఐ ఆనందరావు అక్కడికి చేరుకుని ప్రజలకు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు.
క్వారంటైన్ వార్డు వద్దంటూ నిరసనలు - No Quarantine ward in our area
తమ ప్రాంతంలో క్వారంటైన్ వార్డు ఏర్పాటు చేయవద్దంటూ కడప జిల్లా అనంతరాజుపేట ప్రజలు ఆందోళనకు దిగారు. అధికారుల ప్రయత్నాలు అడ్డుకున్నారు.

అనంతరాజుపేట గ్రామస్థులు నిరసన