కడప జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో అధికారులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నో మాస్క్... నో ఎంట్రీ గోడ పత్రాలను ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్ ఆవిష్కరించారు. దుకాణాలు, మాల్స్, హోటల్స్, ప్రతి ఒక్క వ్యాపార సముదాయాల వద్ద ఈ గోడ పత్రాలు అంటించాలని కలెక్టర్ ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే... మొదటి సారి రూ.300, రెండోసారి రూ.500, మూడోసారి రూ.1000లు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అప్పటికీ మార్పు రాకుంటే దుకాణాన్ని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. కఠిన చర్యలు తప్పవన్నారు.