మౌలిక సదుపాయాలు కరవు
అధికారుల నిర్లక్ష్యం.. అంధకారంలో అంగన్వాడీ కేంద్రాలు - విద్యుత్
వేసవి ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఓ పది నిమిషాలు విద్యుత్ పోతేనే అల్లాడిపోతున్నారు జనం. అలాంటిది ప్రొద్దుటూరులోని అంగన్వాడీ కేంద్రాల్లో కొన్ని నెలలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా నిలిచిపోయి విద్యుత్ మీటర్లు, బల్బులు, ఫ్యాన్లు నిరూపయోగంగా ఉన్నాయి. విద్యుత్ లేక ఉక్కపోతతో పిల్లలు, గర్భిణులు, బాలింతలు బయటే కూర్చుంటున్నారు. జిల్లాలో చాలా కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ కేంద్రాల్లో నీటి సమస్య వేధిస్తోంది. మరుగుదొడ్లలో నీరు లేక నిరూపయోగంగా మారాయి. సమీపంలో కుళాయిలు, చేతిపంపులపైనే ఆధారపడాల్సిన దుస్థితి. మధ్యాహ్నం భోజనం సమయంలో ఇళ్ల వద్ద నుంచి సీసాలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు కొందరు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలని అంగన్వాడీ సిబ్బంది, మహిళలు కోరుతున్నారు.