కడప జిల్లా కమలాపురం బస్టాండ్ నిరుపయోగంగా మారింది. కమలాపురంలో రైల్వే గేటు ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో వేచి ఉండలేక టౌన్లోకి రావడం లేదని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. కోగటం వెళ్లే బస్సులు ఉన్నా ప్రయాణికులు బైపాస్‌లో దిగి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి బస్సులు టౌన్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, కమలాపురం బస్టాండ్‌ను ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
నిరుపయోగంగా కమలాపురం ఆర్టీసీ బస్టాండ్ - kamalapuram rtc bus stand latest news
కడప జిల్లా కమలాపురంలో లక్షల రూపాయలు ఖర్చు చేసి 2005-06 నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. కడప నుంచి ప్రొద్దుటూరు కమలాపురం మీదుగా వెళ్లాల్సిన బస్సులు టౌన్ లోపలికి పోకుండా బైపాస్‌లో వెళ్తున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
![నిరుపయోగంగా కమలాపురం ఆర్టీసీ బస్టాండ్ no buses are coming to kamalapuram bus stand](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7648231-1021-7648231-1592386374568.jpg)
బస్సులు రాక బోసిపోయిన కమలాపురం ఆర్టీసీ బస్టాండ్