ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నా తండ్రిది రాజకీయ హత్య : వైఎస్ సునీతారెడ్డి - నా తండ్రిది రాజకీయ హత్య : వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి

తన తండ్రి హత్య జరిగి రెండేళ్లయినా ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదని.. మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సునీతారెడ్డి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీఎం జగన్​కు మా నాన్న స్వయానా బాబాయి... మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్​కి స్వయానా సోదరుడు.. మాకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని సునీతారెడ్డి ప్రశ్నించారు. నాన్నను హత్య చేసినవారికి శిక్ష పడాలని పోరాడుతున్నానని స్పష్టం చేశారు. అనుమానితుల జాబితాలో 15 మంది పేర్లు ఇచ్చానని వెల్లడించారు.

నా తండ్రిది రాజకీయ హత్య : వైఎస్ సునీతారెడ్డి
నా తండ్రిది రాజకీయ హత్య : వైఎస్ సునీతారెడ్డి

By

Published : Apr 2, 2021, 5:18 PM IST

Updated : Apr 3, 2021, 4:16 AM IST

తన తండ్రిది రాజకీయ హత్యే అని భావిస్తున్నానని మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి హత్య జరిగి రెండేళ్లు అవుతోందన్న సునీతారెడ్డి... ఇప్పటివరకు నిందితులను పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డికి మా నాన్న స్వయానా బాబాయి... మాజీ సీఎం వైఎస్సార్​కు స్వయానా సోదరుడు... ఆయన హత్యకేసులో మాకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని సునీతారెడ్డి ప్రశ్నించారు.

15 మంది అనుమానితుల పేర్లు ఇచ్చా...

ఈ కేసులో మొత్తం 15 మంది పేర్లు ఇచ్చానని సునీతారెడ్డి చెప్పారు. అనుమానితుల జాబితాలో ఎంపీ అవినాష్ సహా పలువురి పేర్లు ఇచ్చానని సునీతారెడ్డి వెల్లడించారు. పిటిషన్‌లో భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. దర్యాప్తు వేగవంతంపై రాష్ట్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. సీబీఐ దర్యాప్తుపై రాజకీయ ఒత్తిడి ఉందని అనుకోవట్లేదన్న సునీతారెడ్డి.. విచారణలో జాప్యం వల్ల ఆధారాలు దొరక్కపోవడంతోపాటు.. సాక్షులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ కేసులో సమగ్ర విచారణ పూర్తిచేసి దోషులను చట్టం ముందు నిలబెడితే.. మరిన్ని నేరాలు జరగకుండా నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈ కేసు గురించి మళ్లీ హైకోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం వస్తుందని అనుకోవట్లేదన్నారు.

రాష్ట్రపతి భవన్ నుంచి కిషన్ రెడ్డి వరకూ...

మా నాన్న హత్య కేసు గురించి రాష్ట్రపతి కార్యాలయం, పీఎంవో అధికారులు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని కలిశా. ఎక్కీదిగని గడపలేదు... తట్టని తలుపూ లేదు. కడప ప్రాంతంలో హత్యలు సాధారణం అన్నట్లు కొందరు మాట్లాడారు. హత్యలు జరగడం సాధారణమెలా అవుతుందో అర్థం కావడం లేదు. విచారణ సరిగా ఎందుకు జరగడం లేదో ప్రభుత్వమే చెప్పాలి. సీబీఐ విచారణతోనూ న్యాయం జరగలేదనే మీడియా ముందుకొచ్చా. నాన్న హత్య కేసులో 15 మంది అనుమానితుల పేర్లు ఇచ్చా. తప్పు జరిగిందని షర్మిలకు తెలుసు. షర్మిల న్యాయం వైపే ఉంటుంది, మాకు అండగా ఉంటుంది. నాన్న హత్య కేసు త్వరగా తేల్చాలన్నదే నా కోరిక.-సునీతారెడ్డి, వైఎస్ వివేకా కుమార్తె.

నా తండ్రిది రాజకీయ హత్య : వైఎస్ సునీతారెడ్డి

ఎందుకీ పోరాటం..?

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు ఎవరన్నది త్వరగా తేలాలి. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారు చనిపోకూడదని కోరుకుంటున్నానని సునీతారెడ్డి పేర్కొన్నారు. కేసు విచారణలో సాక్షులకు హాని జరుగుతుందని భయమేస్తోందన్న సునీతారెడ్డి.. నాన్న హత్య గురించి మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉందన్నారు. న్యాయం కోసం ఇంకా ఎంతకాలం వేచి చూడాలని ప్రశ్నించారు. ఈ పోరాటంలో అందరి సహకారం కావాలని కోరారు.

మా కుటుంబ వృక్షం చాలా పెద్దది...

మా కుటుంబం చాలా పెద్దదని... బయటి వ్యక్తులు వచ్చి హత్య చేసేంత ధైర్యం చేస్తారని అనుకోవడం లేదని సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. నేర స్థలంలో ఆనవాళ్లు లేకుండా చేసిన ఈ హత్య గురించి వాచ్​మెన్​కు తెలిసే ఉంటుందని.. దేశంలో అనేక కీలక రాజకీయ హత్యలను ఛేదించిన సీబీఐ వివేకానందరెడ్డి హత్యను సమగ్రంగా విచారిస్తే... నిజాలు బయటికొచ్చి నిందితులు పట్టుబడతారని పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో అనుకున్నంత మద్దతు కుటుంబసభ్యుల నుంచి లభించకపోయినా.. మద్దతిచ్చినవారంతా... గట్టిగా తన వెనకే ఉన్నారని చెప్పారు.

తప్పు జరిగిందని షర్మిలకు తెలుసు...

షర్మిల చాలా స్ట్రాంగ్ లేడీ... వైఎస్ వివేకా హత్యకేసులో తప్పు జరిగిందని షర్మిలకు తెలుసని సునీతారెడ్డి పేర్కొన్నారు. షర్మిల న్యాయం వైపే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. షర్మిల కూడా అండగా ఉంటుందని అనుకుంటున్నామని చెప్పారు.

సునీతారెడ్డితో ముఖాముఖి

ఈ కేసు గురించి వదిలేయమన్నారు...

ఈ హత్య గురించి వదిలేసి.. ముందుకు సాగాలని చాలామంది శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారని సునీతారెడ్డి పేర్కొన్నారు. తన మనసు మాత్రం న్యాయం కోసం పోరాడాలని చెబుతోందన్నారు. నాన్నను హత్య చేసినవారికి శిక్ష పడాలని పోరాడుతున్నానని సునీతారెడ్డి స్పష్టం చేశారు. ఈ పోరాటం.. నాకు, పిల్లలకూ ప్రమాదమని చాలామంది చెప్పారని సునీతారెడ్డి వివరించారు.

ఇదీ చదవండీ... ఎస్ఈసీ సమావేశం..బహిష్కరించిన ప్రతిపక్షాలు

Last Updated : Apr 3, 2021, 4:16 AM IST

ABOUT THE AUTHOR

...view details