రాష్ట్రంలోకి ప్రవేశించనున్న "నివర్" తుపానును ఎదుర్కొనేందుకు కడప జిల్లా వ్యాప్తంగా అన్ని మండల స్థాయి అధికారులు ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని ఇంఛార్జ్ కలెక్టర్ గౌతమి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం 08562-245259 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నివర్ తుపానుపై ఎస్పీ అన్బురాజన్, సంయుక్త కలెక్టర్ సాయికాంత్‌వర్మతో కలిసి జిల్లా సచివాలయం నుంచి తహసీల్దార్లు, పురపాలక కమిషనర్లతో సమీక్షించారు. ప్రతి తహసీల్దారు కార్యాలయ పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కాలువలు, నదుల పరివాహక ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వచ్చినా తక్షణమే సేవలందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతులు పంట విత్తనాలు విత్తే సమయాన్ని మరో రెండు, మూడు రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...