కడప జిల్లా కమలాపురం మండలం సి.రాజుపాలేనికి చెందిన లక్ష్మీరెడ్డి, సరస్వతమ్మల మొదటి సంతానం నిమ్మకాయల రవిచంద్రరెడ్డి. ప్రస్తుతం ఆర్టీపీపీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. చిన్నతనం నుంచి నాటకాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఇప్పటివరకు దాదాపు 200 పైగా నాటకాలు వేశారు. లాక్డౌన్ కారణంగా పేద కళాకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పాటు సినీ పరిశ్రమ సైతం వారిని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వేసిన కరోనా చింతామణి నాటకం ఆలోచింపచేసింది.
'పేదకళాకారులను ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ ఆదుకోవాలి' - కమలాపురం తాజా వార్తలు
పేదకళాకారులు లాక్డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ప్రముఖ కళాకారుడు నిమ్మకాయల రవిచంద్ర అన్నారు. కరోనాపై అవగాహన కలిగేలా ఆయన వినూత్నంగా కరోనా చింతామణి నాటకాన్ని వేశారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ.. పేద కళాకారులను ఆదుకోవాలని కోరారు.
చింతామని పాత్రలో రవిశంకర్ రెడ్డి