కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్ఐఏ అధికారులు విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మిని మరోసారి విచారించారు. కేరళలో నమోదైన ఓ కేసుకు సంబంధించి 3 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. వరలక్ష్మి సిమ్ కార్డుతో పాటు చరవాణిని అధికారులు సీజ్ చేశారు. అజ్ఞాత మావోయిస్టుల పేర్లు చెప్పి .. వారు మీకు తెలుసా, మావోయిస్టు పార్టీతో పనిచేస్తున్నారా, వారికి సపోర్టు చేస్తున్నారా..? వంటి తదితర ప్రశ్నలు అధికారులు తనను అడిగినట్లు వరలక్ష్మి తెలిపారు.
విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మిని విచారించిన ఎన్ఐఏ
NIA Interrogate: విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మిని ఎన్ఐఏ మరోసారి విచారించింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని వరలక్ష్మి ఇంటికి వెళ్లిన ఎన్ఐఏ అధికారులు.. మూడు గంటలపాటు విచారించారు.
వరలక్ష్మిని విచారించిన ఎన్ఐఏ