విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ పట్ల యాజమాన్యాలు అనుసరిస్తున్న మెుండి వైఖరికి నిరసనగా విద్యుత్ జేఏసీ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీలో నిరసనలు చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎర్రగుంట్ల ఆర్టీపీపీలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన - News of employees' concern in Kadapa district RTPP
కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీలో ఉద్యోగులు చేపట్టిన నిరసనలు ఆరో రోజుకు చేరాయి. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ న్యాయమైన డిమాండ్లు, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ పట్ల యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ జేఏసీ తమ నిరసన తెలుపుతోందని ఉద్యోగులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలన్నారు. వాటి నిర్వహణ ఏపీ జెన్కో లేదా ఏపీజీఇసీఎల్ ద్వారా చేపట్టాలన్నారు. 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్ట్ 31 మధ్య నియమింపబడిన ఉద్యోగులందరినీ ఇ.పి.ఎఫ్. నుంచి జి.పి.ఎఫ్‌కు మార్పు చేసి పెన్షన్ సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు. ఒప్పంద కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్ చేయలన్నారు. పెండింగ్‌లో ఉన్న అన్నీ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్ యాజమాన్యాలు ఎటువంటి బెదిరింపు ధోరణికి దిగినప్పటికీ తమ డిమాండ్లు నెరవేరేంతవరకూ ఆందోళనలు ఆపే ప్రసక్తే లేదని విద్యుత్ జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు.
ఇవీ చదవండి