గంజాయి ఎందుకు తాగుతున్నావు అని ప్రశ్నించినందుకు వాలంటీర్‌పై ఓ యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన కడపలోని పాత కడపలో జరిగింది. గాయపడిన వ్యక్తిని... చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. పాత కడపకు చెందిన వాలంటీర్ నవీన్... విధుల నిమిత్తం వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన కిట్టు అనే యువకుడు గంజాయి తాగుతున్నాడు. అది గమనించి వాలంటీర్.... అతని వద్దకు వెళ్లి గంజాయి తాగొద్దని మందలించాడు.
అతను మాట వినని పరిస్థితుల్లో... వాలంటీర్ చేయి చేసుకున్నాడు. కోపోద్రిక్తుడైన కిట్టు ఇంటికి వెళ్లి కత్తి తీసుకువచ్చి వాలంటీర్ పొత్తి కడుపుపై పొడిచాడు. తీవ్రంగా గాయపడిన వాలంటీర్‌ను స్థానికులు కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అపాయం లేదని తెలిపారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.