కడప రిమ్స్ వద్ద బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో పొరుగు సేవల సిబ్బంది నిరసన తెలియజేశారు. దేశ వ్యాప్తంగా ఈనెల 26న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఐదు నెలలుగా రిమ్స్ లో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి జీతాలు ఇవ్వటం లేదని సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ ఆరోపించారు. .ప్రభుత్వం పొరుగు సేవల ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 26న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ సీఐటియు నిరసన - కడప తాజా వార్తలు
బకాయి వేతనాలు త్వరగా చెల్లించాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో పొరుగు సేవల సిబ్బంది నిరసన తెలియజేశారు. అలాగే దేశ వ్యాప్తంగా ఈనెల 26న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ సీఐటియు నిరసన