కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ పేలి ఓ వ్యక్తికి లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. వంశీ స్లాబ్స్ పాలిషింగ్ యూనిట్ దగ్గర్లోని ట్రాన్స్ఫార్మర్లో నుంచి పొగలు వస్తున్నాయని దాని లీజ్దారు శివారెడ్డి విద్యుత్తు సిబ్బందికి సమాచారం అందించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో విద్యుత్తు నియంత్రిక పేలింది. దాని పక్కనున్న లక్షలు విలువ చేసే పాలిషింగ్ మిషన్ కాలిపోయింది. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బాధితుడు ఆరోపించారు. వారే తనకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశాడు.
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం... లక్షల్లో ఆస్తి నష్టం - వంశీ స్లాబ్స్ పాలిషింగ్ యూనిట్
ట్రాన్స్ఫార్మర్ నుంచి పొగలు వస్తున్నాయని దాని పక్కనే వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి విద్యుత్తు అధికారులకు సమాచారం ఇచ్చాడు. వాళ్లు స్పందించలేదు. ట్రాన్స్ఫార్మర్ పేలింది. సదరు వ్యక్తికి లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. దానికి కారణం విద్యుత్తు అధికారులేనని అతను ఆరోపించాడు. తక్షణం నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశాడు.
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం... ఓ వ్యక్తికి లక్షల్లో ఆస్తి నష్టం