ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారుల తనిఖీలు.. నాటుసారా స్వాధీనం - Special Enforcement Officers checks news

స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు కడప జిల్లా రైల్వే కోడూరులో జరిపిన తనిఖీల్లో భాగంగా ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. నాటుసారాను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Natusara seized
స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తనిఖీల్లో నాటుసారా స్వాధీనం

By

Published : Jul 2, 2020, 10:25 PM IST

కడప జిల్లా రైల్వే కోడూరులో స్పెషల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కోడూరు మండలం, లక్ష్మీ గారి పల్లి క్రాస్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఐదు లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటుసారాను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రామ్మోహన్​ తెలిపారు. ఆ వ్యక్తి అరుంధతీవాడ వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో ఎస్సై రామ్మోహన్, హెడ్ కానిస్టేబుల్ మోహన్ రెడ్డి, కానిస్టేబుళ్లు ఎల్లయ్య, రవికుమార్, శివ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details