కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ రామ మోహన్ సిబ్బందితో కలసి నాటుసారా అక్రమ మద్యంపై దాడులు నిర్వహించారు.
కోడూరు నుండి చిట్వేలికి వెళ్లే బస్సు మార్గంలో ఎస్సార్ పెట్రోల్ బంకు వద్ద ప్లాస్టిక్ క్యాన్ లో ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కోడూరు మండలం గుండాలపల్లికి చెందిన బండ్ల బాలాజీ వద్ద వ్యక్తిని అరెస్ట్ చేశారు. మండలంలోని బుడుగుంట పల్లె గ్రామ సమీపంలోని కొండ ప్రాంతాలలో నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. నాలుగు డ్రమ్ములలో సుమారు 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. యజమానుల కొరకు గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు.