బద్వేలులో జాతీయ క్రీడా పోటీలు ప్రారంభం.. - latestnews National level sports competitions at badwel
కడప జిల్లా బద్వేలు బీవీఆర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 8 తేదీ నుంచి జరిగే ఈ క్రీడా పోటీలను కడప యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. దేశంలోని 20 రాష్ట్రలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనెందుకు 2500 మంది కదిలి వచ్చారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ విద్యాసంస్థల కార్యదర్శి రితేష్ కుమార్, జిల్లా క్రీడాల విభాగం కార్యదర్శి రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.