ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Viveka Murder Case:సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలపై విచారణ వాయిదా

సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలు
సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలు

By

Published : Aug 27, 2021, 5:00 PM IST

Updated : Aug 27, 2021, 8:24 PM IST

16:56 August 27

వివేకా హత్య కేసు

మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్​కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోసం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్​పై జమ్మలమడుగు కోర్టులో విచారణ జరిగింది. 45 నిమిషాల పాటు ఇరుపక్షాల న్యాయవాదులు ఆన్​లైన్​లో వాదనలు వినిపించారు. వాదనలు విన్న జమ్మలమడుగు మెజిస్ట్రేట్..విచారణ వచ్చే నెల 1కి వాయిదా వేసింది.   ​

ఈ కేసులో మరో కీలక అనుమానితుడు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని 164 సెక్షన్ కింద వాంగ్మూలం ఇప్పించేందుకు సీబీఐ అధికారులు ప్రొద్దుటూరు తీసుకెళ్లారు. కడప జైలు అతిథి గృహం నుంచి ముందుగా కడప కోర్టుకు...అటునుంచి ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ కోర్టు సూపరింటెండెంట్ లేని కారణంగా తిరిగి కడపకు తీసుకొచ్చారు. రేపు మరోసారి దస్తగిరిని ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

సమాచారమిస్తే రివార్డు..

వివేకా హత్యకేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 21న పత్రికా ప్రకటన ఇచ్చింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని..హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్ లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి Viveka Murder Case: వివేకా హత్య కేసు.. మేజిస్ట్రేట్ ముందుకు దస్తగిరి..! 

Last Updated : Aug 27, 2021, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details