ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

16 నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్శవాలు - పసుపులేటి  బ్రహ్మయ్య

ఈ నెల 16 నుంచి కడప జిల్లా రాజంపేట మండలంలోని భువనగిరి పల్లె శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రాలను మాజీ మంత్రి  పసుపులేటి  బ్రహ్మయ్య, ఆలయ ధర్మకర్తల మండలి ఆవిష్కరించారు.

16 నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్శవాలు

By

Published : May 10, 2019, 8:08 PM IST

16 నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్శవాలు

కడప జిల్లా రాజంపేట మండలం భువనగిరి పల్లె కొండపై వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 16 నుంచి వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రాలను మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, ఆలయ ధర్మకర్తల మండలి ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా... ఈనెల 16వ తేదీన ఉదయం స్వామివారికి అభిషేకాలు, సహస్రమార్చన, రాత్రికి ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. 17న నరసింహ స్వామి జయంతిని పురస్కరించుకుని...కవిత ధారణ, ప్రత్యేక పూజలు ఉంటాయి. అదే రోజు రాత్రి స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు. 18వ తేదీ ఉదయం అభిషేకాలు, రాత్రి గరుడవాహనంపై నరసింహ స్వామి విహరిస్తారు. 19 తేదీ ఉదయం స్వామివారి కళ్యాణం, రాత్రి గజవాహనంపై స్వామివారి ఊరేగింపు ఉంటుంది. 20వ తేదీ ఉదయం వసంత సేవ, రాత్రి ఏకాంత సేవ కార్యక్రమాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ABOUT THE AUTHOR

...view details