తితిదేకు అనుబంధంగా ఉన్న కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. కొవిడ్ నివారణ చర్యలో భాగంగా బ్రహ్మోత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 23న ఉదయం 9:30 నుంచి పదిన్నర గంటల వరకు ధ్వజారోహణం, 31న ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహన సేవలు జరగనున్నాయి. జూన్ 1న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు. గతేడాది కూడా కరోనా వల్ల నారాపుర బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితం అయ్యాయి. వరుసగా రెండో ఏటా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం.
23 నుంచి నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - Narapura Brahmotsavam in Jammalamadugu news
కడప జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. జూన్ 1న సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
![23 నుంచి నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు Jammalamadugu Narapura Brahmotsavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:06:25:1621157785-ap-cdp-36-16-narapura-brahmochavalu-av-ap10039-16052021145001-1605f-1621156801-436.jpg)
నారపుర నరసింహస్వామి ఆలయం