Lokesh Selfie at Sand Dumping Centre: బద్వేల్ నియోజకవర్గంలో సాగుతున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయత్ర నదియాబాద్ విడిది కేంద్రం వద్ద ముగిసింది. 122 వ రోజు నారా లోకేశ్ 17.7 కిలోమీటర్ల దూరం నడిచారు. ఇప్పటి వరకు నారా లోకేశ్ 1556.7 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం బనగానపల్లిలో ప్రారంభమైన యాత్రలో ... జంగాంపల్లె ఇసుక డంపింగ్ కేంద్రం వద్ద లోకేశ్ సెల్ఫీ దిగారు.
ఇసుక డంపు వద్ద లోకేశ్ సెల్ఫీ:నారా లోకేష్ యువ గళం పాదయాత్ర రాజంపేట నియోజకవర్గంలో పూర్తిచేసుకుని బద్వేలు నియోజకవర్గం లోకి ప్రవేశించింది. ఉదయం ఎనిమిది గంటలకు సిద్ధవటం మండలం జంగాలపల్లి నుంచి ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర ఘాట్రోడ్లో సాగుతూ బద్వేల్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జంగాలపల్లి వద్దనే ఇసుక డంపు భారీగా ఉండడంతో అక్కడే లోకేష్ సెల్ఫీ తీసుకున్నారు. వైసీపీ నాయకులు ఇసుక ఆక్రమంగా దోచేసి బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతానికి తరలిస్తూ కోట్ల రూపాయల వెనకేసు కుంటున్నారని నారా లోకేష్ విమర్శించారు. స్థానికంగా ఉన్న వారికి ఇసుక లభించకపోయినా వైసీపీ నాయకులకు మాత్రం దోచుకుంటున్నారని ఆరోపించారు. దారి పొడవునా మహిళలు హారతులు పట్టారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు ను లోకేష్ పలకరించి ఫోటోలు దిగారు. బద్వేలు నియోజకర్గంలో లో పాదయాత్ర ప్రవేశించగానే స్థానిక టీడీపీ నేతలు విజయమ్మ, రితీష్ రెడ్డి స్వాగతం పలికారు. మధ్యాహ్నం అట్లూరు విడిది కేంద్రంలో లోకేష్ విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర కొనసాగించారు.
మొసలి కన్నీరు కార్చే ధనిక సీఎం: ఏపీలో ఇప్పుడు నడుస్తున్నది క్యాష్ వార్ అని నారా లోకేష్ స్పష్టం చేసారు. వందల కోట్ల విలువైన ప్యాలెస్ లో కమిషన్‌గా వస్తున్న నోట్ల కట్టల మీద పడుకుని,పేదల గురించి మొసలి కన్నీరు కార్చే ధనిక సీఎంకు పేదలను దోపిడీ దొంగల నుంచి కాపాడి, వారిని ధనవంతులను చేయడానికి తపిస్తున్న పేదల పక్షపాతి చంద్రబాబుకి క్యాష్ వార్ నడుస్తోందని వ్యాఖ్యానించారు.