ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lokesh Yuvagalam ప్రొద్దుటూరులో లోకేశ్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు.. వివేకా హత్యకు సంబంధించిన ప్లకార్డులు ప్రదర్శన - యువగళం పాదయాత్ర 113వ రోజు విజయవంతం

Lokesh Yuvagalam Padayatra: సీఎం జగన్ ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల్నినట్టేట ముంచారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రకటించిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని భరోసా వచ్చారు. ప్రొద్దుటూరులో వివేకా హత్యకు సంబంధించిన ప్లకార్డులు టీడీపీ శ్రేణులు ప్రదర్శించడం, విడిది కేంద్రానికి వెళ్లుతున్న లోకేశ్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్త కోడిగుడ్డుతో దాడి ఘటనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. కోడిగుడ్డుతో దాడి చేసిన వ్యక్తికి టీడీపీ శ్రేణులు దేహశుద్ది చేశాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 2, 2023, 7:22 AM IST

Updated : Jun 2, 2023, 8:12 AM IST

Lokesh Yuvagalam Padayatra : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 113వ రోజువిజయవంతంగా ముగిసింది. వైఎస్సార్సీపీ కవ్వింపు చర్యల మధ్య పెద్ద ఎత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు అండరాగా లోకేశ్ పాదయాత్ర విజయవంతంగా సాగింది. గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రొద్దుటూరు పట్టణంలోకి పాదయాత్ర మొదలవుగానే దారి పొడవునా తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చి లోకేశ్ బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా మహిళలు హారతులు ఇచ్చి లోకేశ్​ను పలకరించారు. లోకేశ్ పై మహిళలు చిన్నారులు పూల వర్షం కురిపించారు.

పూల వర్షం :నారా లోకేశ్ పాదయాత్ర ప్రొద్దుటూరులోకి వచ్చే దారి పొడవున వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అడుగడుగునా వైఎస్సార్సీపీ ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో దానికి ప్రతిఫలంగా వీధుల్లో రూటు మార్చుకొని పాదయాత్ర చేపట్టాల్సి వచ్చింది. ఆ వీధుల్లోనే పెద్ద సంఖ్యలో మహిళలు మేడల పైనుంచి పూల వర్షం కురిపించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పోటీగా చేపట్టిన ఫ్లెక్సీలకు నిరసనగా టీడీపీ పార్టీ నేతలు కూడా వారికి దీటుగా జవాబు ఇచ్చారు. ఏకంగా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకొని పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు.

హూ కిల్డ్ బాబాయ్ :'బాబాయిని ఎవరు చంపారు.. బాబాయిని చంపింది అబ్బాయి..' అనే నినాదాలతో కూడినటువంటి పోస్టర్లను ప్రదర్శించారు.హూ కిల్డ్ బాబాయ్ అనే పోస్టర్లను తో కూడన ప్లకార్డులను చేత పట్టుకొని పెద్దపెటునా నినాదాలు చేసుకుంటూ దేశం కార్యకర్తలు పాదయాత్ర ముందు వెనక నడిచారు. ఈ ప్ల కార్డులు పట్టుకోవడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు లోకేశ్ వద్దకు వెళ్లి వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. దానికి ససేమేరా అన్న నారా లోకేశ్ మేము పాదయాత్ర చేస్తుంటే వైఎస్సార్సీపీ నాయకులు పోటీగా ఫ్లెక్సీలు కట్టిన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

జగన్, అవినాష్ జైలుకు వెళ్లాల్సిందే :చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వివేక కేసుకు సంబంధించిన ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేస్తే కేసులు పెడతామని డీఎస్పీ నాగరాజు హెచ్చరించడంతో వెనక్కి తగ్గేది లేదని లోకేశ్ పట్టుపట్టారు. డీఎస్పీ ఎదురుగానే ప్లకార్డు తీసుకొని లోకేశ్ చేత్తో పైకెత్తి ప్రజలకు చూపించారు. వివేకాను ఎవరు చంపారో మీకు తెలుసా అంటూ సైగలతో ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. వివేక హత్య కేసులో జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. చేసేది లేక పోలీసులు వెనుతిరిగి వెళ్లిపోయారు.
మహిళలకు మహాశక్తి :అనంతరం ప్రొద్దుటూరు శివాలయం వద్ద బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగించారు. నాలుగేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అరాచకం విధ్వంసం దోచుకోవడం ప్రజలపై భారం మోపడమే పనిగా పెట్టుకునే పాలన చేశారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అని చెపితే ప్రజలంతా నమ్మి ఆయన్ని గెలిపించారని ఇప్పుడు ఏం చేశారో మీకు తెలిసి వచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు మహాశక్తిపేరుతో అనేక పథకాలు ప్రవేశపెడుతున్నామని అవన్నీ తప్పకుండా అమలు అయ్యే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

జీరో జగన్ రెడ్డి : నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలను వచ్చే ఐదేళ్లలో కల్పిస్తామని చెప్పారు.పెండింగ్​లో ఉన్న పోస్టులను భర్తీ చేయడమే కాకుండా డీఎస్సీని అమలు చేస్తామని జాబ్ క్యాలెండర్​నుతప్పకుండా రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయలు సంపాదించిన జీరో జగన్ రెడ్డి పేదవాడని ప్రజలకు పరిచయం చేసుకుంటున్నారని ఇది ప్రజలంతా విశ్వసిస్తారా అనీ లోకేశ్ అన్నారు. ఐదు ప్యాలెస్లు విలాసవంతమైన భవంతులు కలిగిన వ్యక్తి పేదవాడా అని ప్రశ్నించారు.

ఆయనో బెట్టింగ్ ప్రసాద్.. అఖండ మెజారిటీతో గెలుపు :పొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసాద్రెడ్డి తాను పాదయాత్రగా వస్తుంటే అడ్డుకుంటానని శబదాలు చేస్తున్నాడని అంత ధైర్యం ఉందా అని ఆయన సవాలు విసిరారు. ఎమ్మెల్యే నాలుగేళ్ల పాలనలో క్రికెట్ బెట్టింగ్, మట్కా గ్యాంబ్లింగ్ వంటి ఆసాంఘిక కార్యకలాపాలు చేయడమే కాకుండా తన ఇంటినే అసాంఘిక కార్యకలాంగులకు అడ్డగా మార్చుకున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే బెట్టింగ్ ప్రసాద్ అని నామకరణం చేశారు. తవ పార్టీ కార్యకర్త నందం సుబ్బయ్యని దారుణంగా హత్య చేయించిన వ్యక్తి ఈ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అని ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీని అఖండ మెజారిటీతో ప్రొద్దుటూరులో గెలిపించాలని నారా లోకేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
లోకేశ్​పై కోడుగుడ్డుతో దాడి.. దేహశుద్ధి : ప్రొద్దుటూరులో రాత్రి బహిరంగ సభ ముగించుకొని విడది కేంద్ర వద్దకు నారా లోకేశ్ పాదయాత్రగా వెళుతున్న సందర్భంలో మార్గమధ్యంలో ఓ వైఎస్సార్సీపీ కార్యకర్త కోడుగుడ్డు విసిరాడు. స్థానికంగా ఉన్న దుకాణదారులతో లోకేశ్ మాట్లాడుతున్న సందర్భంలో సమీపంలో ఉన్న వ్యక్తి కోడిగుడ్డు విసరడంతో అది పొరపాటున లోకేశ్ తగలకుండా పక్కన ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తగిలింది. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా కోడిగుడ్డు విసిరిన వ్యక్తికి పట్టుకొని విచక్షణారహితంగా దేహశుద్ధి చేశారు. వెంటనే అతన్ని పోలీసులకు అప్పగించడంతో వారు స్టేషన్ తరలించారు.

చిల్లర చేష్టలు :అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీస్ అధికారులతో నారా లోకేశ్ వాగ్వాదానికి దిగారు. తన పాదయాత్ర చేస్తుంటే ఇలాంటి దాడులు చేయడం ఏంటని నిరసన తెలియజేశారు. పోలీసులు సర్ది చెప్పడంతో తిరిగి పాదయాత్ర కొనసాగించి విడిది కేంద్రానికి చేరుకున్నారు. నారా లోకేశ్ పై కోడి గుడ్డుతో దాడి చేయించడం వెనక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి హస్తం ఉందని లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావడంతో జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యే ఇలాంటి చిల్లర చేష్టలు పాల్పడుతున్నారని టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు.

Eggs Attack on Nara Lokesh: నారా లోకేశ్‌పై కోడిగుడ్డు విసిరిన ఆకతాయి... దేహశుద్ది చేసిన టీడీపీ కార్యకర్తలు
బందోబస్తు చర్యలు :శుక్రవారం పొద్దుటూరు శివారులోని విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది అయితే రాత్రి ఘటన జరగడంతో పెద్ద సంఖ్యలో ఆయనకు శుక్రవారం పాదయాత్రకు పార్టీ శ్రేణులు అనుసరించే అవకాశం ఉంది. పోలీసులు కూడా మరింత బందోబస్తు చర్యలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రొద్దుటూరులో లోకేశ్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

ఇవీ చదవండి

Last Updated : Jun 2, 2023, 8:12 AM IST

ABOUT THE AUTHOR

...view details