ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nara Lokesh: రెడ్డి సోదరులను జగన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడు: నారా లోకేశ్ - యువగళం పాదయాత్ర

lokesh comments on jagan: తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని.. లోకేశ్ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఎక్కువ నష్టపోయింది.. రెడ్డి సోదరులే అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా రెడ్డి సామాజికవర్గం ప్రతినిధులతో కడపలో లోకేశ్​ ముఖాముఖి నిర్వహించారు. రెడ్డి సామాజికవర్గం జగన్ చేతిలో బాధితులుగా మారారని లోకేశ్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్లలో ఉన్న పేదలను ఆదుకుంటామని, రెడ్డి భవనం ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jun 6, 2023, 6:05 PM IST

Nara Lokesh meeting with Reddy community leaders: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రాధాన కార్యదర్శి నారా లోకేశ్​ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో ఎక్కువ నష్టపోయింది రెడ్డి సోదరులే అని లోకేశ్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ప్రతినిధులతో నారా లోకేశ్.. కడపలో యువగళం విడిది కేంద్ర వద్ద ముఖాముఖి నిర్వహించారు. రెడ్డి సామాజికవర్గం జగన్ చేతిలో బాధితులుగా మారారని లోకేశ్ ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వంలో.. కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని లోకేశ్ ఎధ్దేవా చేశాడు. సజ్జల రామకృష్ణరెడ్డి, పాపాల పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, జగన్ మోహన్ రెడ్డి వీళ్లు తప్ప ఏ ఇతర కుటుంబానికి న్యాయం జరగలేదనీ లోకేశ్ వ్యాఖ్యానించారు. పులివెందుల, వేంపల్లి, కడప, రైల్వే కోడూరు ప్రాంతానికి చెందిన పలువురు రెడ్డి సామాజిక వర్గం నాయకులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు అడిగిన పలు అంశాలకు నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. రెడ్డి సోదరులు మొదటి నుండి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని లోకేశ్ పేర్కొన్నాడు. జగన్ పాలనలో రెడ్లకు కనీస గౌరవం దక్కడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్లలో కొన్ని అపోహలు కల్పించాడని ఆరోపించాడు.

Lokesh Egg Case: లోకేశ్​పై గుడ్ల దాడి ఘటన.. పరస్పర కేసులు నమోదు

జగన్ చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మి రెడ్డి సోదరులు మోసపోయారనీ లోకేశ్ వెల్లడించారు. నిన్న జిల్లాలో టీడీపీ నాయకుడు జయరాం రెడ్డిపై వైసీపీ నాయకులు దాడి చేశారని.. దాడిని ఖండిస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్లలో ఉన్న పేదలను ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. రెడ్డి భవనం ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెండింగ్​ బిల్లులన్నీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్​గా తయారు చేస్తామని లోకేశ్ వెల్లడించారు. దానిమ్మ, అరటి, బొప్పాయి, మామిడి, కర్జూరం తదితర పంటలు వేసేలా అధిక ప్రోత్సాహం ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.

రెడ్డి సామాజిక వర్గ నేతలతో నారా లోకేశ్ సమావేశం

Lokesh with experts: 'ఆ రోజే నిర్ణయించుకున్నా.. అడ్వకేట్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం'

వైసీపీ ప్రభుత్వంలో.. కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి, పాపాల పెద్ది రెడ్డి, సుబ్బా రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి మాత్రమే బాగుపడ్డారు. జగన్ చేసిన అసత్య ప్రచారాన్ని నమ్మి రెడ్డి సోదరులు మోసపోయారు. రెడ్డి సోదరులు మొదటి నుండి తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చాం. ఇప్పడు ఆ సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీ ఆదుకుంటాం. -నారా లోకేశ్​, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details