ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాడు-నేడు : విద్యాలయాలకు సమకూరుతున్న వసతులు

కార్పొరేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూ.185 కోట్ల వ్యయంతో నాడు- నేడు పథకంలో అభివృద్ధి చేస్తున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పది రకాల సౌకర్యాలను సమకూరుస్తున్నారు.

schools
schools

By

Published : Oct 23, 2020, 4:09 PM IST

కడప జిల్లాలో ఈ పథకం కింద చేపట్టిన పనులు గడువులోగా పూర్తి చేయించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొదటివిడతలో నాడు- నేడు కింద 1040 ప్రభుత్వ పాఠశాలలను ఎంపికచేశారు. 600 స్కూళ్లలో ఆటలతో కూడిన విద్యను బోధించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 80 శాతం పనులు జరిగాయి. బల్లలు, ఫ్యాన్లు సరఫరా అయ్యాయి. ఈ నెలాఖరుకు ప్రభుత్వ పాఠశాలలు అన్ని రకాల వసతులతో దర్శనం ఇవ్వనున్నాయి. తాగునీరు, పరిశుభ్రత, చెట్లు, మరుగుదొడ్లు, ప్రత్యేక ఆటస్థలం, విజ్ఞానాన్ని పెంపొందించే చిత్రాలతో పాటు ఉత్తమ బోధనను అందించేందకు చర్యలు చేపట్టారు. కార్పొరేట్‌ స్కూళ్లలో అధిక రుసుం చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో 2ప్రభుత్వ బడుల్లో ఉచితంగా విలువలతో కూడిన విద్యను అందివ్వబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

అందంగా రూపుదిద్దుకున్న బల్లలు బద్వేలు బాలుర ఉన్నత పాఠశాలకు వచ్చాయి. వందేళ్ల చరిత్ర ఉన్న పాఠశాల ఇది. జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు కల్గిన ఈ బద్వేలు బాలుర సరస్వతి నిలయానికి రూ.1.15 కోట్లతో పది రకాల వసతులను సమకూర్చుతున్నారు. జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అధికారులు కృషి చేస్తున్నారు. నీటిశుద్ధి యంత్రం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, విద్యుత్తు దీపాలు తదితర సౌకర్యాల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

80 శాతం పనులు పూర్తి

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు- నేడు పనులు 80 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 20 శాతం పనులు ఈ నెలాఖరుకు పూర్తి చేస్తాం. నవంబరు 2వ తేదీ నాటికి అన్ని సౌకర్యాలు సమకూరేలా చూస్తాం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందకు చర్యలు చేపట్టాం. మొదటి విడతగా 1040 పాఠశాలల్లో పనులను ప్రారంభించాం. 2022 నాటికి జిల్లాలో ఉన్న 3253 ప్రభుత్వ పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేస్తాం. - ప్రభాకర్‌రెడ్డి, సర్వశిక్ష అభియాన్‌ పీడీ, కడప

  • గడువులోగా పనుల పూర్తికి చర్యలు
  • ప్రభుత్వ పాఠశాలలు : 3,253
  • మొదటి విడతలో చేపట్టినవి : 1,040
  • ఎప్పటికి పూర్తి : నవంబరు 2
  • ఖర్చు చేస్తున్న నిధులు : రూ.185 కోట్లు
  • మిగిలిన 2,213 విద్యాలయాలు
  • ఎప్పటికి పూర్తి : 2022 జూన్‌ 30

ఇదీ చదవండి:దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్​కు గుండెపోటు!

ABOUT THE AUTHOR

...view details