'నాడు-నేడు' మొదటి దశ అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. 'నాడు-నేడు' పనుల పరిశీలనలో భాగంగా...జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మతో కడప నగరంలోని జయనగర్ కాలనీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పనుల ప్రగతిపై ఆరా తీశారు. పాఠశాల తరగతి గదులు, పెయింటింగ్, ఆకుపచ్చ బోర్డులు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ రూములు, ఫ్లోర్ టైల్స్ తదితర నిర్మాణ పనులను పరిశీలించారు.ప్రస్తుత విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను తెలుసుకున్నారు.
పాఠశాల అభివృద్ధికి మంజూరయిన నిధులు, ఖర్చుల వివరాలను, పనుల పురోగతిని వివరాలను అధికారులు ఉపముఖ్యమంత్రికి వివరించారు. పాఠశాల సింథటిక్ గ్రౌండ్ ఫ్లోర్‌తో అధునాతన ప్రత్యేక మైదానాన్ని సిద్ధం చేశామని పీఓ తెలిపారు.