Mylavaram I.T.I Students Suffer With Classrooms: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, మైలవరంలో కొత్త కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ కళాశాలలో సరిపడా తరగతి గదుల్లేక, కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులందరికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకే గదిని కేటాయించడంతో అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు. కొత్త కళాశాల కోసం మైలవరంలో మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించినా, ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణ పనుల నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Students Fire on YSRCP Govt: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైఎస్సార్ జిల్లా మైలవరంలో ఐటీఐ విద్యార్థులు తరగతి గదుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులందరికీ కళాశాలలో ఒకే గదిని కేటాయించడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కళాశాలను తాత్కాలికంగా జమ్మలమడుగుకు మార్చినప్పటికీ అక్కడ కూడా గదులు అధ్వానంగా ఉన్నాయంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించి, కొత్త కళాశాల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
SSBN College students: 'కళాశాలను ప్రైవేటీకరించేందుకు లోలోపల కుట్ర'
Students Comments: ''వైయస్సార్ జిల్లా మండల కేంద్రమైన మైలవరంలో 2015వ సంవత్సరంలో జూనియర్ ఐటీఐ కళాశాల మంజూరు అయ్యింది. కళాశాలలో ఒక గదిని మాత్రమే విద్యార్థులకు కేటాయించారు. దీంతో మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. చాలా అసౌకర్యంగా కూడా ఉంది. ఆ తర్వాత మమ్మల్ని జమ్మలమడుగు ఐటీఐలోకి తాత్కాలికంగా మార్చారు. కానీ, అక్కడ కూడా సరైన సదుపాయాలు లేవు. కొన్ని పనులు మాత్రమే జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో మిగతా నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పటికైనా సీఎం జగన్, అధికారులు స్పందించి మాకు అన్ని వసతులతో కూడిన కళాశాలను కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం.'' అని పలువురు ఐటీఐ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.