కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం చౌదరివారిపల్లె మడేరు వంక వద్ద గత నెల 28న మడేరు వంక వద్ద 142 దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈకేసుకు సంబంధించి చాపాడు మండలం రేపల్లెకు చెందిన పి.వెంకటేశ్వర్లు, దువ్వూరు మండలం బుక్కాయపల్లెకు చెందిన తప్పెట బయపురెడ్డిలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి మరో ఆరు ఎర్రచందనం దుంగలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ బి.విజయ్‌కుమార్ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఎర్రచందనం దుంగల కేసులో ఇద్దరు అరెస్ట్ - red sandalwood case near Brahmangarimath latest update
కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం చౌదరివారిపల్లె మడేరు వంక వద్ద స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల కేసులో ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మైదుకూరు డీఎస్పీ బి.విజయ్‌కుమార్ తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఎర్రచందనం దొంగలు