మీడియా ప్రతినిధులకు బీమా కల్పించాలని కడప జిల్లా మైదకూరులో.. ఏఐవైఎఫ్ నాయకులు నిరసనకు దిగారు. మీడియా ప్రతినిధులను కరోనా వారియర్స్‌గా గుర్తించి... 50 లక్షల రూపాయల బీమా కల్పించాలని ఏఐవైఎప్ జిల్లా సహాయ కార్యదర్శి మాలకొండయ్య డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు.. మైదకూరు మదన్ మోహన్ నగర్ వద్ద జాతీయ రహదారిపై.. ప్లకార్డలు ప్రదర్శిస్తూ, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ, కరోనా సమయాన్ని అదనుగా తీసుకొని..ఎమ్మార్పీ ధరలకు మించి మందులను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితులకు కరోనా కిట్లు అందజేయాలని సూచించారు. హోమ్ క్వారంటైన్లో ఉంటున్న బాధితులకు పౌష్టికాహారంతో పాటు... ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో అందించే, అన్ని రకాల మందులను అందించాలని డిమాండ్ చేశారు.
'మీడియా ప్రతినిధులను కరోనా వారియర్స్‌గా గుర్తించాలి' - మైదకూరు ఏఐవైఎఫ్ నాయకుల నిరసన వార్తలు
మీడియా ప్రతినిధులను కరోనా వారియర్స్‌గా గుర్తించాలని ఏఐవైఎఫ్ నాయకులు.. కడప జిల్లా మైదకురులో నిరసనకు దిగారు. మీడియా ప్రతినిధులకు 50 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.
ఏఐవైఎఫ్ నాయకుల నిరసన