ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిర్బంధ కేంద్రాలను సందర్శించిన మైదకూరు ఎమ్మెల్యే - kadapa district latest updates

మైదకూరులో 300 పడకలతో మూడు చోట్ల నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కరోనా వైరస్​ లక్షణాలు, విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి కోసం ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆయా కేంద్రాలను సందర్శించారు.

mydakuru mla visits quarantine centres
మైదకూరులో 300 పడకలతో నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు

By

Published : Apr 3, 2020, 4:23 PM IST

విదేశాలు, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారి ఆరోగ్యాన్ని పరిశీలించడం కోసం కోసం కడప జిల్లా మైదుకూరులో 300 పడకలతో మూడు చోట్ల నిర్బంధ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం మైదుకూరు మండలం వనిపెంట బాలికల గురుకుల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పరిశీలించారు. బెడ్డు, తలగడ తో పాటు పళ్లెం, గ్లాసు సిద్ధం చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా వివరించారు. నిర్బంధ కేంద్రంలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు వెల్లడైతే అలాంటి వారిని కడపకు తరలిస్తామని అధికారులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details