ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఏఏ, ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తూ వినూత్న నిరసన - రాజంపేటలో ముస్లింల రిలే నిరాహార దీక్షలు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ కడప జిల్లా రాజంపేటలో వామపక్షాలు, ముస్లిం మైనార్టీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. భాజపా సర్కార్ దేశ ప్రజల్లో అభద్రత భావాన్ని పెంచుతోందని విమర్శించారు.

muslims protest
muslims protest

By

Published : Feb 1, 2020, 9:00 PM IST

సీఏఏ, ఎన్​ఆర్​సీను వ్యతిరేకిస్తూ వినూత్న నిరసన

ఎన్ఆర్​సీ, సీఏఏను వ్యతిరేకిస్తూ కడప జిల్లా రాజంపేటలో ముస్లిం మైనార్టీ నాయకులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ సీపీఐ, సీపీఎం, ముస్లిం మైనార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం శిబిరం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు పదో రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో ఆదివారం మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని... భారతదేశ చిత్రపటం ఆకారంలో మానవహారం చేపట్టాలని నిర్ణయించారు. ఎన్ఆర్​సీ, సీఏఏ చట్టాలను అమలు చేయడం ద్వారా దేశ ప్రజల్లో అభద్రత భావాన్ని పెంచారని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాలను వైకాపా ఎంపీలు వ్యతిరేకించాలని, అసెంబ్లీ సమావేశాలు పెట్టి చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details