కేంద్రం అమలు పరచిన పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని... రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. కృష్ణా, కడప, విశాఖ, కర్నూలు, ప్రకాశం, పశ్చిమగోదావరి, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని ప్రధాన కూడళ్లలో నిరసనలు చేశారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని ఆందోళనకారులు హెచ్చరించారు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని.. .పౌరులకు అభద్రత కల్పించే పౌరసత్వ చట్టాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని పలువురు నేతలు విజ్ఞప్తి చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు తేదేపా, వైకాపా నాయకులు మద్దతు పలకడం దారుణమన్నారు. ఈ బిల్లును కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ వామపక్షాలు డిమాండ్ చేశాయి.
సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు - cab bill news
ఎన్నార్సీ, సీఏఏ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేపట్టారు. భిన్నత్వంలో ఏకత్వంగా ప్రజలు జీవించే మన దేశంలో... కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్రం ఈ బిల్లులను ప్రవేశ పెట్టిందని ఆందోళనకారురలు ఆరోపించారు.
సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ...రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల ర్యాలీ