పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం మహిళలు కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. మట్టిపెద్దపులి కూడలి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పాఠశాల, కళాశాలల విద్యార్థులు, చిన్నా పెద్దా తేడా లేకుండా వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముస్లింలకు అన్యాయం చేస్తే సహించేది లేదని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వారు తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి మద్దతు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళల ర్యాలీ - కడపలో ముస్లిం మహిళల ర్యాలీ వార్తలు
పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం మహిళలు కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మహిళల ర్యాలీ