సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.... ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో కడప పాత కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభత్వం ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ముద్రించిన గోడ పత్రాలను నేతలు ఆవిష్కరించారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చెయ్యకుంటే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరించారు.
సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా గోడ పత్రాల ఆవిష్కరణ - కడపలో ముస్లింల రిలే నిరాహార దీక్షల న్యూస్
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... కడప పాత కలెక్టరేట్ ఎదుట ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను రద్దు చేయాలంటూ ముద్రించిన గోడ పత్రాలను ఆవిష్కరించారు.
![సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా గోడ పత్రాల ఆవిష్కరణ ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో కడప పాత కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5807936-474-5807936-1579761857629.jpg)
ముస్లిం ఐకాస ఆధ్వర్యంలో కడప పాత కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు