ముస్లిం మనుగడకు ప్రశ్నార్ధకంగా మారిన చట్టాలు రద్దు చేయాలని ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కడపలో భారీ ఎత్తున ముస్లింలు బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు జిల్లా నలుమూలల నుంచి ముస్లింలతోపాటు మత పెద్దలు హాజరయ్యారు. ఈ చట్టాల వల్ల కలిగే నష్టాలు తెలియజేశారు. ఈ సభకు ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా, బెంగళూరుకు చెందిన నాయకుడు ఇబ్రహీం హాజరయ్యారు. ఆంధ్రలో ఈ చట్టాలను అమలు చేయమని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
సీఏఏ అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ముస్లింల డిమాండ్ - NRCA and CAA latest news update
కడప జిల్లా జనసంద్రంగా మారింది. ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముస్లింలు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ చట్టాలతో తమ భవిష్యత్తు అంధకారమవుతుందని వారంత ఆందోళన వ్యక్తం చేశారు.
కడపలో ముస్లింల భారీ బహిరంగ సభ