మాంసం ముక్కల వద్ద మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా మారి.. హత్యకు దారి తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపకు చెందిన స్నేహితులు శివ, షేర్ ఖాన్ స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ నెల 15న మరో స్నేహితుడి ఇంట్లో జరిగిన కార్యక్రమంలో మాంసం ముక్కల విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనకు షేర్ ఖాన్ ముక్కలు తక్కువ వేశాడని శివ గొడవ పెట్టుకున్నాడు. ఆవేశంతో తన వద్ద ఉన్న కత్తితో షేర్ ఖాన్‌ను గాయపరిచారు. ఈ ఘటనపై షేర్ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి శివపై షేర్ఖాన్ పగ పెంచుకున్నాడు.
రెండు రోజుల కిందట షేర్ ఖాన్.. తన స్నేహితుల ద్వారా శివకు ఫోన్ చేసి పిలిపించుకుని గొడవ పెట్టుకున్నాడు. మాటా మాటా పెరగడంతో షేర్ ఖాన్ శివను గొంతు కోసి హతమార్చి.. స్నేహితుల సాయంతో మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి కేసీ కెనాల్ కాలువ పక్కన పడేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షేర్‌ఖాన్‌తోపాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మృతుడితో పాటు నిందితుడు షేర్ఖాన్పై గతంలో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.