ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేలులో భార్యను కడతేర్చేందుకు భర్త యత్నం.. - murder attempt in kadapa badwelu

కడప జిల్లా బద్వేల్ బి.వి.ఆర్ కళాశాల వద్ద భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన వదినను కత్తితో దాడి చేసి గాయపరిచాడు. స్థానికులు అడ్డుకోవడంతో పరారయ్యాడు.

murder attempt in kadapa badwelu
బద్వేలులో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

By

Published : Jan 5, 2020, 7:22 PM IST

బద్వేలులో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

కడప జిల్లా బద్వేలు మండలం తిరువెంగళాపురానికి చెందిన సులోచనకు... బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంటకు చెందిన పాణ్యం శేఖర్​తో 12 ఏళ్ల కిందట వివాహమైంది. పెళ్లైన రెండు సంవత్సరాలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో ఇద్దరు కూతుళ్లతో సులోచన పుట్టినింటికి చేరింది. నందిపల్లె వద్ద పాల డైరీలో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో తోటివారితో ఆటోలో కలిసి పనికి వెళ్తున్న సులోచనపై భర్త కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన వారిని చంపుతానంటూ బెదిరించాడు. సకాలంలో స్థానికులు స్పందించి ప్రాణాపాయన్ని తప్పించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బద్వేలు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details