కడప జిల్లా మైదుకూరులో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలు మేరి (35) మృతి చెందారు. విధుల్లో పాల్గొనేందుకు అరుంధతి నగర్ నుంచి పురపాలక కార్యాలయానికి భర్తతో కలిసి వస్తుండగా.. వారి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ప్రమాదంలో మేరి అక్కడికక్కడే మృతి చెందారు. భర్త బాలరాజు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారును సంఘటనా స్థలంలో ఆపకుండా వెళ్లిపోయారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మైదుకూరులో రోడ్డు ప్రమాదం.... పారిశుద్ధ్య కార్మికురాలు మృతి - woman died in mydukuru accident
కడప జిల్లా మైదుకూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందారు. భర్తతో కలిసి విధులకు వస్తుండగా.. వీరి వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్మికురాలు అక్కడికక్కడే మృతి చెందగా... ఆమె భర్తకు గాయాలయ్యాయి.

పారిశుద్ధ్య కార్మికురాలు మృతి