కడప జిల్లా రాజంపేటలో పారిశుద్ధ్య కార్మికులు.. సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేశారు. కరోనాతో ప్రజలు వణికిపోతున్న సమయంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా పనులు చేస్తున్నామన్నారు. తెలంగాణ తరహాలో వేతనంతో పాటు అదనంగా ఐదు వేల రూపాయలను ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజంపేట పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులకు ఉదయం అల్పాహారాన్ని మధ్యాహ్నం భోజనాన్ని అధికారులు అందజేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రవికుమార్ కోరారు. కరోనా ప్రభావంతో బయట ఎక్కడ దుకాణాలు లేనికారణంగా మండుటెండలో అల్పాహారం కోసం తాగునీటి కోసం కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
వేతనాలు పెంచాలంటూ పారిశుద్ధ్య కార్మికుల నిరసన - municipal workers protest for demanding additional wages
కడప జిల్లా రాజంపేట పురపాలిక కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమకు వేతనంతో పాటు అదనంగా 5 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వేతనాలు పెంచాలని పారిశుద్ధ్య కార్మికుల నిరసన.