కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఆరోగ్యం సహకరించటం లేదని సెలవు అడిగినా, పని చేయాలని అధికారులు ఒత్తిడి చేయటంతోనే నరసింహులు అనే కార్మికుడు విధుల్లోనే గుండెపోటుతో మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులపై పని భారం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు అధికారుల వద్దకు వెళ్తుంటే తమను హీనంగా చూస్తున్నారని వాపోయారు. మేస్త్రీ జీవో లత మహిళా కార్మికులనీ చూడకుండా, నీచంగా మాట్లాడుతున్నారనీ వాపోయారు. కమిషనర్ తమను ఉద్యోగాల నుంచి తీసేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ఆమెను ప్రొద్దుటూరు కార్యాలయం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
'ఉద్యోగాలు తీసేస్తామని బెదిరిస్తున్నారు' - ప్రొద్దుటూరు మున్సిపల్ కార్మికుల ఆందోళన
కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం కార్యాలయం ఎదుటు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని కార్మికులు ఆరోపించారు.
ప్రొద్దుటూరు పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన