పురపాలక ఎన్నికల ప్రక్రియ షురూ...ప్రొద్దుటూరు ఓటర్ల జాబితా విడుదల - voter list
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పురపాలక ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని ఓటర్ల జాబితాను వార్డుల వారీగా విడుదల చేశారు.
పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా మున్సిపల్ కమిషనర్ విడుదల చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 40 వార్డులకు గాను లక్షా 33 వేల 252 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీరిలో పురుషులు 65,030 మంది, మహిళా ఓటర్లు 68,195 మంది, 27 మంది ఇతరులున్నట్లు కమిషనర్ రమణారెడ్డి ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో సరవరణలు ఉంటాయని పేర్కొన్నారు.