మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 77వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో జరుగుతున్న సీబీఐ విచారణకు పులివెందుల మున్సిపల్ సిబ్బంది గంగులయ్య, సురేశ్ హాజరయ్యారు. కడపలో ఓ ప్రైవేట్ పాఠశాల అకౌంటెంట్ జగదీశ్వరరావు సీబీఐ విచారణకు హాజరయ్యారు.
VIVEKA MURDER CASE: సీబీఐ విచారణకు పులివెందుల మున్సిపల్ సిబ్బంది - కొనసాగుతున్న సీబీఐ విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 77వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో జరుగుతున్న సీబీఐ విచారణకు పులివెందుల మున్సిపల్ సిబ్బంది గంగులయ్య, సురేశ్ హాజరయ్యారు.
వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణలో భాగంగా నిన్న వివేకా ఇంటి కాపలాదారు రంగన్నను అధికారులు మరోసారి విచారించారు. భారీ భద్రత మధ్య రంగన్న సీబీఐ విచారణకు వచ్చారు. వాంగ్మూలం ఇచ్చినప్పటి నుంచి రంగన్నకు పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. పులివెందుల పురపాలికలో పనిచేసే గంగన్నను సైతం సీబీఐ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని సీబీఐ ఇప్పటికే రివార్డు ప్రకటించింది.
ఇదీ చదవండి:
Corona cases: దేశంలో కొత్తగా 30,948 మందికి వైరస్
Last Updated : Aug 22, 2021, 12:34 PM IST