కరోనా కారణంగా గత మార్చిలో నిలిచిపోయిన మున్సిపల్, నగరపాలక ఎన్నికలను తిరిగి అక్కడి నుంచే నిర్వహిస్తున్నట్లు కడప నగరపాలక కమిషనర్ లవన్న తెలిపారు. అప్పుడే నామినేషన్లను స్వీకరించామని తెలిపిన ఆయన మార్చి 2,3 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు. అదేరోజు సాయంత్రం అభ్యర్థుల జాబితా ప్రకటించి......మార్చి 10వ తేదిన ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 14వ తేదిన జే.ఎం.జే కళాశాలలో ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. కడప కార్పొరేషన్తో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల, బద్వేల్, రాయచోటి, మైదుకూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఉంటాయన్నారు. కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు.
మార్చి 10న నగరపాలక ఎన్నికలు - కడప జిల్లా తాజా వార్తలు
మార్చి 10 న నగరపాలక ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు కడప నగరపాలక కమిషనర్ లవన్న తెలిపారు. 14తేదిన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
మాట్లాడుతున్న కడప నగరపాలక కమిషనర్