ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జమ్మలమడుగులో రెచ్చిపోతున్న మట్టి మాఫియా.. - కడప జిల్లాలో మట్టి మాఫియా అక్రమాలు

కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ భూమి అది. బంగారంలాంటి ఎర్రమట్టిని అక్రమార్కులు ప్రైవేటు వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదివేల ట్రాక్టర్ల మట్టిని తరలించారు. స్థానిక నాయకుల అండదండలతోనే ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.

Mud Mafia illegal activities at jammalamadugu
జమ్మలమడుగులో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

By

Published : Nov 25, 2020, 8:57 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో మట్టి మాఫియా హద్దులు దాటుతోంది. మండలంలోని గూడెం చెరువు సమీపంలో ప్రభుత్వ భూమిలో ఎర్ర మట్టి కొండలను కొల్లగొడుతున్నారు. వేల ట్రాక్టర్ల మట్టిని ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్​ను రూ. 380 నుంచి 500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.

ఈ తతంగం రెండు మూడు నెలలుగా కొనసాగుతున్న భూగర్భ గనుల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు స్పందించకపోవడం దారుణం. గతంలో మైనింగ్ విజిలెన్స్ దాడులు జరిగినా స్థానిక నాయకులు ఏమాత్రం బెదరడం లేదు. ఈ వ్యవహారంలో ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నందున అధికారులు సైతం జంకుతున్నారు. చూసి చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సహజ వనరులు కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

జమ్మలమడుగు మండలంలో గూడెం చెరువు సమీపంలోని ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది. ఈ మేరకు సిబ్బంది దాడులు చేపట్టి కొన్ని ట్రాక్టర్లు, జేసీబీలను జప్తు చేశాారు. ఇలాంటి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటాం . -మధుసూదన్ రెడ్డి, జమ్మలమడుగు తహసీల్దార్

జమ్మలమడుగులో రెచ్చిపోతున్న మట్టి మాఫియా

ఇదీ చూడండి:

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల నియామకాలెప్పుడో?

ABOUT THE AUTHOR

...view details