కడప జిల్లా రైల్వే కోడూరులో స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంతో పాటు దేశం నుంచి కరోనా వైరస్ నిర్మూలించేందుకు రైల్వేకోడూరులోని శ్రీ బుజంగేశ్వర స్వామి దేవాలయంలో మృత్యుంజయ హోమం చేశారు. భుజంగేశ్వర స్వామి దేవస్థానం పండితులు సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కరోనా నిర్మూలనకు రైల్వేకోడూరులో మృత్యుంజయ హోమం - రైల్వేకోడూరు ఎమ్మెల్యే తాజా సమాచారం
రైల్వేకోడూరు నియోజకవర్గ ప్రజలే కాకుండా దేశంలో ఎవరికీ కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండాలంటూ స్థానిక ఎమ్మెల్యే మృత్యుంజయ హోమం జరిపారు. ఈ కార్యక్రమం రైల్వేకోడూరులోని బుజంగేశ్వర స్వామి దేవాలయంలో జరిగింది.
రైల్వేకోడూరులో మృత్యుంజయ హోమం చేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసులు