కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి అవసరమయ్యే తాగు, సాగునీటినీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలంలో ఉన్న పైడిపాలెం ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేశారు. నియోజకవర్గంలోని 6 మండలాలకు ఈ నీరు వెళ్తుంది. తాగునీటికి అవసరమైన పథకాలకు, రైతులకు పంటలు సాగు చేసుకునేందుకు చెరువులు, కుంటలకు నీరు నింపేందుకు కోసం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ... గత పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈప్రాంతానికి నీరు తీసుకురావటం జరుగుతుందన్నారు. పులివెందుల నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ దృఢనిశ్చయంతో ఉన్నారన్నారు.
పులివెందుల నియోజవర్గానికి తాగు, సాగు నీటి విడుదల - "పులివెందులను సస్యశ్యామలం చేయటమే...సీఎం ఉద్దేశ్యం"
కడప జిల్లాలోని పైడిపాలెం ప్రాజెక్టు ద్వారా పులివెందుల నియోజకవర్గంలోని 6 మండలాలకు అవసరమయ్యే తాగునీటిని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విడుదల చేశారు.
"పులివెందులను సస్యశ్యామలం చేయటమే...సీఎం ఉద్దేశ్యం"
TAGGED:
MP_Water_Release