ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం - రాయచోటిలో మిథున్ రెడ్డి కారు ప్రమాదం

Mithun Reddy car Accident : రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. రాయచోటి రింగ్ రోడ్డు వద్ద ఎంపీ మిథున్ రెడ్డి కారును మరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.

Accident
ప్రమాదం

By

Published : Jan 16, 2023, 3:57 PM IST

Mithun Reddy car Accident : ఎంపీ మిథున్ రెడ్డి రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ బయటపడ్డారు. తన తండ్రి మంత్రి పెద్దిరెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి కనుమ పండుగ కోసం పుంగనూరు నుంచి వీరబల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్‌రోడ్డు వద్ద మిథున్ రెడ్డి కారును ఎదురుగా మరో కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో ఎంపీ మిథున్​ రెడ్డి వాహనం పల్టీలు కొట్టడంతో ఆ వాహనంలో ఉన్న ఆయన వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి ముందే ఎంపీ మిథున్ రెడ్డి.. తన తండ్రి అయిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారులో ఎక్కడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. రాయచోటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గురైన రెండు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ABOUT THE AUTHOR

...view details