కడప జిల్లా జమ్మలమడుగు శివారులో ఆగస్టు నుంచి ఉక్కు కర్మాగారం(Kadapa steel plant) పనులు ప్రారంభమవుతాయని కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూరగాయల మార్కెట్, ఆర్ఓ ప్లాంట్, క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు నుంచి ఉక్కు కర్మాగారం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
Kadapa steel plant: రెండున్నరేళ్లలో కడప స్టీల్ ప్లాంట్ మొదటి దశ పనులు - ఎంపీ అవినాష్ రెడ్డి వార్తలు
కడప స్టీల్ పనులు ఆగస్టు నుంచి ప్రారంభమవుతాయని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. జిల్లాలోని జమ్మలమడుగు నగర పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

ఎంపీ అవినాష్ రెడ్డి
రెండు లేదా రెండున్నర సంవత్సరాల్లో మొదటి దశ పనులు పూర్తి చేస్తామని ఎస్ఆర్ గ్రూపు నిర్వాహకులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అందరి సహకారంతో జమ్మలమడుగు, ఎర్రగుంట్ల నగర పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి.Visaka steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై.. కార్మికుల పోరాటం ఉద్ధృతం