అనేక రకాల పథకాలను ప్రజల ముంగిటకే చేర్చి గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని కదిరి రహదారిలో ఉన్న ఎస్ఎస్ఆర్ గార్డెన్ పంక్షన్ హాలులో సోమవారం నియోజకవర్గంలోని వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్ల సేవలకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. మెుదటగా దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. గడిచిన 23 నెలల్లో పరిపాలనలో విప్లవాత్మక మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతోందని అన్నారు.
రాబోయే రోజుల్లో నియోజకవర్గాల వారీగా సచివాలయాల వద్దకు వెళ్లి.. సమస్యలు తెలుసుకుని వాటిని ముఖ్యమంత్రి సాయంతో పరిష్కరిస్తామని చెప్పారు. కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్ మాట్లాడారు. ఉత్తమ ప్రతిభ చూపిన పులివెందుల నియోజకవర్గంలోని 1244 మంది వాలంటీర్లకు సేవా మిత్రు. 40 మందికి సేవారత్న, 5 మందికి సేవా వజ్ర పురస్కరాలు అందజేశారు. నగదు, పతాకం, ప్రత్యేక బ్యాడ్జ్‌లను అందజేస్తూ శాలువాతో ఎంపీ, కలెక్టర్ వారిని సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రీనివాసులరెడ్డి, డీడీఓ ప్రభాకర్ రెడ్డి, ఏపీఎంఐపీ పీడీ మధుసూదన్‌రెడ్డి, ఓఎస్టీ అనీల్‌కుమార్‌రెడ్డి.. పాల్గొన్నారు.