కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. తమ భూములకు సంబంధించి పరిహారాన్ని చెల్లించాలని నిరసన తెలియజేశారు. సోమవారం సున్నపురాళ్లపల్లె గ్రామంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పర్యటించారు.
ఎంపీ అవినాష్‌కి గ్రామస్థులు తమ సమస్యలు విన్నవించారు. అసైన్డ్ భూములను ఆన్‌లైన్‌లో ఎక్కించి పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో కొందరికి న్యాయం జరగలేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి అర్హులకు పరిహారం అందజేస్తామని ఎంపీ అవినాష్ అన్నారు.