కడప జిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. పులివెందుల నియోజకవర్గ ప్రజలందరూ స్థానిక సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకువెళ్లగా... సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. ప్రతి ప్రజాసమస్యను పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతుందని... ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని అవినాష్ రెడ్డి తెలిపారు. గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేసే దిశగా పనిచేస్తాయని... వాటిని ప్రజలు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.
కడప జిల్లాలో ఎంపీ అవినాష్ ప్రజాదర్బార్ - mp avinash at kadapa
కడప జిల్లాలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎంపీ అవినాష్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించారు.
కడప జిల్లాలో ఎంపీ అవినాష్ ప్రజాదర్బార్
Last Updated : Oct 28, 2019, 8:34 AM IST