సరైన దారి లేక మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం చెర్లోపల్లె గ్రామంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన జయమ్మ(70) గురువారం మృతి చెందింది. మృతదేహాన్ని శ్మశానం వద్దకు తీసుకెళ్లేందుకు బంధువుల అష్టకష్టాలుపడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్మశానానికి వెళ్లే దారి పూర్తిగా దెబ్బతింది. నీరు నిలిచి.. మోకాళ్ల లోతు వరకు దిగబడుతోంది. ఆ మార్గం వెళ్లలేని పరిస్థితి. దీంతో నాగళ్లు బిగించిన ట్రాక్టర్‌కు వెనుక భాగంలో మృతదేహాన్ని కట్టి.. తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని శ్మశానానికి దారి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మరో దారి లేక...ట్రాక్టర్‌కు మృతదేహాన్ని కట్టి..! - moving dead body in tractor in kadapa district
సరైన దారి లేక మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నాగళ్లు బిగించిన ట్రాక్టర్‌కు వెనుక భాగంలో మృతదేహాన్ని కట్టి.. తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.
ట్రాక్టర్‌కు మృతదేహాన్ని కట్టి